![]() |
![]() |
by Suryaa Desk | Wed, Feb 12, 2025, 06:04 PM
తాను హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గత రెండు మూడు దశాబ్దాల నుంచి చిత్రపరిశ్రమలో కొనసాగుతున్నానని, కానీ, తన సినీ కెరీర్‌లో తాను ఇప్పటివరకు పోషించిన పాత్రల్లో ‘లక్ష్మి’ అనే పాత్ర ‘ది బెస్ట్’ క్యారెక్టర్ అని సీనియర్ సినీ నటి రోహిణి అన్నారు. ‘లెన్స్’, ‘తలైక్కూత్తల్’ వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు జయప్రకాష్ రాధాకృష్ణన్ ‘కాదల్ ఎన్బదు పొదువుడమై’ అనే పేరుతో ఇద్దరు యువతుల మధ్య ప్రేమను వివరిస్తూ రూపొందించారు. ‘ప్రేమ అనేది స్త్రీ పురుషుల మధ్య ఉండేది మాత్రమే కాదని, రెండు స్వచ్ఛమైన హృదయాల మధ్య ఉండేదని, అలాంటి ప్రేమను గౌరవిస్తూ ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుందాం’ అనే కాన్సెప్టుతో తెరకెక్కించారు. ఈ నెల 14వ తేదీ రిలీజ్ కానుంది. సోమవారం ఈ చిత్రం ఆడియో ట్రైలర్ రిలీజ్ చేశారు.
Latest News