![]() |
![]() |
by Suryaa Desk | Thu, Feb 13, 2025, 02:58 PM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ భాగమయ్యారు. ఆయన నటిస్తున్న 544వ చిత్రమిది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందంతోపాటు అనుపమ్‌ఖేర్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ‘‘ఇండియన్ చిత్ర పరిశ్రమకు బాహుబలిగా పేరుపొందిన ప్రభాస్ కలిసి నా 544వ ప్రాజెక్ట్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై టాలెంటెడ్ హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అద్భుతమైన కథ.. జీవితంలో ఇంతకంటే ఇంకేం కావాలి ఫ్రెండ్స్ జయహో’’ అని ట్వీట్ చేశారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. దీనికి ‘ఫౌజీ’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ‘‘మీరు ఇంతవరకూ చూడని కథను చూపిస్తున్నాం. ప్రభాస్ ఉన్నారు కాబట్టి ఎన్ని అంచనాలను అయినా అది అందుకుంటుంది. ఇప్పటివరకు ఎప్పుడూ చూడని ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. ‘సీతారామం’ తర్వాత దీనిని రాయడానికే సుమారు ఏడాదికి పైగా సమయం పట్టింది. ప్రేక్షకులు తప్పకుండా సర్‌ప్రైజ్ ఫీలవుతారు’’ అని దర్శకుడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇందులో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వీ నటిస్తున్నారు.
Latest News