![]() |
![]() |
by Suryaa Desk | Thu, Feb 13, 2025, 03:55 PM
జ్యోతి పూర్వజ్ తాజాగా తన గ్లామర్ ఫోటోషూట్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి క్యారెక్టర్ లో నటించి, తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది జ్యోతి పూర్వాజ్.బుల్లితెర ప్రేక్షకులకు సీరియల్స్ ద్వారా మరింత దగ్గరైన ఈ ముద్దుగుమ్మ , సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు యువత మనసు దోచుకుంటుంది.ఈ సీరియల్ లో ఆంటీ క్యారెక్టర్ లో నటించిన ఈమె.. వయసుకు మించి నటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.ఇక సీరియల్ ముగిసిన తర్వాత ఇంస్టాగ్రామ్ లో తన అందాలతో ఒక్కసారిగా తన ఏజ్ ను పరిచయం చేసింది. ఈమెనా ఇన్నాళ్లు ఆంటీ అని పిలిచింది అంటూ అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.ఇక ఇప్పుడు తన భర్త ప్రముఖ డైరెక్టర్ పూర్వాజ్ దర్శకత్వంలో సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యింది.అందులో భాగంగానే రోజుకొక గ్లామర్ ఫోటోషూట్ షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న జ్యోతి తాజాగా ఫ్లవర్ ప్రింటెడ్ క్రీం కలర్ సారీ ధరించి, దానికి కాంబినేషన్లో గ్రీన్ కలర్ బ్లౌజ్ ధరించి అందాలతో ఆకట్టుకుంది.