![]() |
![]() |
by Suryaa Desk | Thu, Feb 13, 2025, 06:29 PM
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇటీవల 'సత్య' మూవీ రీ-రిలీజ్ టైమ్ లో చాలా భారీ స్టేట్ మెంట్ ఇచ్చాడు. 'సత్య' తర్వాత దర్శకుడిగా తానెంత దిగజారిపోయాడో... కళ్ళకు కట్టినట్టు చెప్పాడు. ఆ తర్వాత తాను తీసిన చాలా సినిమాలు దారుణాతిదారుణంగా ఉన్నాయని, వాటిని తీయకుండా ఉంటే ఎంతో బాగుండేదని అన్నాడు. అంతేకాదు... ఇక మీదట చెత్త సినిమాలు తీయడం కంటే... ఖాళీ ఉంటానని హామీ ఇచ్చాడు. ఒకవేళ సినిమా తీయాల్సి వస్తే... 'సత్య' మూవీని ఒకటికి రెండు సార్లు చూసి... ఆ తర్వాత మొదలెడతానని అన్నాడు. ఇలాంటి భారీ స్టేట్ మెంట్ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ 'శారీ' వస్తోంది. మరి దాని పరిస్థితి ఏమిటని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.కేరళకు చెందిన ఓ మలయాళీ ముద్దుగుమ్మ ఫోటోలను సోషల్ మీడియాలో చూసి... వర్మ మనసు పడ్డారు. ఆమెను హైదరాబాద్ పిలిపించుకుని, ఆమెతో ఓ సినిమా తీయాలని ఫిక్స్ అయ్యారు. చిత్రం ఏమంటే... సినిమా కథ రెడీ అయ్యిందో లేదో తెలియదు కానీ దానికి 'శారీ' అనే పేరు పెట్టాలని మాత్రం ఫిక్స్ అయిపోయారు. ఆ అందాల ముద్దుగుమ్మ పేరును ఆరాధ్యదేవి గా వర్మ మార్చేశారు. శారీలో రకరకాల భంగిమల్లో ఆమె ఫోటోలు తీసి... సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కుర్రకారులో వేడి సెగలు రేపేశారు. తాజాగా ఆరాధ్యదేవి తో వైల్డ్ యానిమల్స్ తో స్పెషల్ ఫోటో షూట్ చేసి, మీడియాకు వదిలారు వర్మ. అయితే... ఈ సినిమా మేకింగ్ కంటే కూడా సోషల్ మీడియాలో పెట్టిన ఆరాధ్యదేవి ఫోటోల మీదనే అంతా ఎక్కువ ఫోకస్ పెట్టారు. మొత్తానికి 'శారీ' సినిమాను కంప్లీట్ చేసి దానికి 'టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ' అనే ట్యాగ్ లైన్ పెట్టి... లాస్ట్ ఇయరే విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు వర్మ. కానీ అనివార్య కారణాలతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. సెన్సార్ వాళ్ళు ఈ చిత్రానికి ఎన్ని కట్స్ చెబుతారో అని ట్రైలర్ చూసినప్పుడు చాలామంది అనుకున్నారు. ఏంజరిగిందో ఏమో కానీ సెన్సార్ కార్యక్రమాలను సైతం వర్మ సజావుగానే పూర్తి చేశారు. ఇప్పుడీ సినిమాను మ్యాంగో మీడియా ద్వారా ఆర్జీవీ డెన్ ఈ నెల 28న 'శారీ' మూవీని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతోంది.ఇక్కడే అందరినీ ఒక ప్రశ్న తొలిచివేస్తోంది. వర్మ ఇకపై తన చిత్రాలన్నీ ఓ స్థాయిలో ఉంటాయని, 'సత్య' రీ-రిలీజ్ సాక్షిగా చెప్పిన మాట నిలబెట్టుకుంటారా? లేదా? అనేది. నిజానికి వర్మ ఈ స్టేట్ మెంట్ ఇవ్వడానికంటే ముందే 'శారీ' మూవీ షూటింగ్ పూర్తయిపోయింది. మరి తన మాటకు కట్టుబడి ఆయన రీ-షూట్ ఏమైనా చేశారా? లేకపోతే ఏవైనా వల్గర్ సీన్స్ ఉంటే వాటిని తొలగించారా? అనేది తెలియదు. అలా చేసి ఈ మూవీని ఓ సైకలాజికల్ థ్రిల్లర్ గా జనం ముందుకు తీసుకొస్తే... అందరూ అప్రిషియేట్ చేస్తారు. వర్మ లో కొంతైన మార్పు వచ్చిందని భావిస్తారు. అలా కాకుండా ఈ సినిమా నిర్మాతను నేను కాదు, ఈ మూవీ డైరెక్టర్ ను నేను కాదు అని వర్మ తప్పించుకున్నా చేసేది ఏమీ లేదు. ఎందుకంటే... వర్మ బ్రెయిన్ చైల్డ్ గా చెప్పుకుంటున్న ఈ సినిమాకు రవిశంకర్ వర్మ నిర్మాత, గిరి కృష్ణ కమల్ డైరెక్టర్. సో... రేపు ఎవరైనా 'శారీ' సినిమాను విమర్శిస్తే... వర్మ ఎంచక్కా దీనిని డిజోన్ చేసుకునే ఆస్కారం లేకపోలేదు. ఈ సినిమాలో ఆరాధ్యదేవితో పాటు సత్యా యాదు, సాహిల్ సంభవాల్, అప్పాజీ అంబరీష్, కల్పలత కీలక పాత్రలు పోషించారు. మరి పొలిటికల్ మోటివేట్ మూవీస్ పంథా నుండి బయటకు వచ్చి వర్మ తీసిన 'శారీ' జనాలను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
Latest News