![]() |
![]() |
by Suryaa Desk | Thu, Feb 13, 2025, 06:30 PM
'పుష్ప’తో పాన్ ఇండియా దర్శకుడయ్యారు సుకుమార్. గత డిసెంబర్ 5న విడుదలైన పుష్ప-2తో భారీ విజయాన్ని అందుకున్నారు. దాదాపు రూ.1800 కోట్లు వసూళ్లు రాబట్టింది తగ్గేదేలే అని నిరూపించారు. ప్రస్తుతం సుకుమార్ 'పుష్ప-2' సక్సెస్‌ను ఆస్వాదిస్తూ క్లౌడ్ నైన్‌లో ఉన్నారు.ఈ సందర్భంగా ఆయన భార్య తబితా ఇంట్లో రమా సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు.సంప్రదాయ దుస్తులు, నగలు ధరించి ఫొటోలకు ఫోజ్ ఇచ్చారు తబిత. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.తబితకు స్టైలింగ్ మీద అవగాహన ఉంది. అంతే కాదు కంటెంట్ బావున్న చిత్రాలను సెలెక్ట్ చేసుకుని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా సుకుమార్-తబిత దంపతులు కూతురు సుకృతి వేణి కీలక పాత్ర పోషించిన 'గాంధీ తాత చెట్టు' చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు తబిత.
Latest News