![]() |
![]() |
by Suryaa Desk | Thu, Feb 13, 2025, 05:42 PM
యువ సామ్రాట్ నాగా చైతన్య మరియు సాయి పల్లవి నటించిన రొమాంటిక్ యాక్షన్ డ్రామా 'తాండల్' ఫిబ్రవరి 7న విడుదల అయ్యింది. ఈ చిత్రం చాయ్ కెరీర్‌లో చాలా అవసరమైన విజయంగా అవతరించింది. ఈ చిత్రం విడుదలైన అయిదు రోజులలో ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల గ్రాస్ ని వాసులు చేసింది. రానున్న రోజులలో ఈ చిత్రం 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అవుతుందని భావిస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాకి బుక్ మై షోలో 1M+ టికెట్స్ అమ్ముడైనట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నాగ చైతన్యకు ఇది కెరీర్-బెస్ట్ ఓపెనింగ్. శ్రీకాకుళానికి చెందిన రాజు అనే మత్స్యకారుడిగా చై నటించారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాకి షామ్‌దత్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్షన్ ని నిర్వహిస్తున్నారు. ఈ సినిమాలో దివ్య పిళై కీలక పాత్రలలో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్‌పై బన్నీ వాస్ ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం 2018లో జరిగిన యదార్థ సంఘటనల నుండి ప్రేరణ పొందింది.
Latest News