![]() |
![]() |
by Suryaa Desk | Thu, Feb 13, 2025, 12:41 PM
సుప్రీం కోర్టులో సినీనటుడు, దర్శక, నిర్మాత మంచు మోహన్ బాబుకు ఊరట లభించింది. జర్నలిస్టులపై దాడి కేసులో ఆయనకు ధర్మాసనం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ తో వివాదం సమయంలో ఆయన పలువురు జర్నలిస్టులపై దాడి చేసిన విషయం తెలిసిందే.మోహన్ బాబు కుటుంబంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. మోహన్ బాబు, ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేశారు. హైదరాబాద్ జల్ పల్లిలోని నివాసం వద్ద 2024 డిసెంబర్ 10న జర్నలిస్టుపై మోహన్ బాబు మైక్ తో దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి మోహన్ బాబుపై పహాడిషరీఫ్ పోలీసులకు బాధిత జర్నలిస్టు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.అయితే మోహన్ బాబు తనపై నమోదైన ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ముందుగా హైకోర్టును ఆశ్రయించారు. కానీ 2024 డిసెంబరు 23న హైకోర్టు రిజెక్ట్ చేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరగగా.. ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
Latest News