![]() |
![]() |
by Suryaa Desk | Thu, Feb 13, 2025, 06:25 PM
మెగాస్టార్ చిరంజీవి తనకు, తన కుటుంబానికి దైవంతో సమానం అని చెబుతోంది హీరోయిన్ ఊర్వశీ రౌతెల ఆయన మాకు ఏమీ కారు.. సినిమాలో నటించిన చిన్న పరిచయం అంతే. కానీ కష్టంలో ఎంతో అండగా నిలిచారు. అందుకే ఆయన్ను దైవంలా భావిస్తున్నామని, తమ బలానికి ఆయనొక లైట్‌హౌస్ లాంటివారని అంటోంది ఊర్వశీ. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇటీవల ఊర్వశీ తల్లి మీను రౌతెల ఆస్పత్రి పాలైంది. ఆమె ఎడమ కాలిలో ఎముకలో ఇంట్రా ఆర్టిక్యూలర్ ఫ్రాక్చర్ అయింది. అదెంతో ప్రమాదకరమని వైద్యులు చెప్పగా ఊర్వశీ చిరంజీవిని సహాయం కోరింది. అందుకు స్పందించిన చిరంజీవి కోల్‌కత్తా అపోలో ఆస్పత్రి బృందంతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చేశారు. డాక్టర్లు సర్జరీ చేయడంతో ఆమె ఆ సమస్య నుంచి గట్టెక్కింది. ఈ విషయమై తమ కుటుంబం చిరంజీవికి జీవిత కాలం రుణపడి ఉంటామని చెబుతోంది.
Latest News