by Suryaa Desk | Wed, Sep 25, 2024, 11:27 AM
తెలంగాణ వైద్యారోగ్య శాఖ మరో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇటీవలనే 2050 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి ప్రకటన రాగా… తాజాగా 633 ఫార్మాసిస్టు గ్రేడ్ 2 పోస్టులను భర్తీకి ప్రకటన ఇచ్చారు.ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి అక్టోబర్ 05వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ మేరకు మంగళవారం పూర్తి వివరాలను ప్రకటించారు.ఆన్ లైన్ దరఖాస్తులకు అక్టోబరు 21వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. అక్టోబర్ 23, 24 తేదీల్లో ఆన్ లైన్ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షలు నవంబర్ 30వ తేదీన జరుగుతాయి. https://mhsrb.telangana.gov.in/ వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్దతిలో పనిజేసే వారికి వెయిటేజ్ కల్పిస్తారు. ఇందుకు సంబంధించిన వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫార్మసీ పూర్తి చేయటంతో పాటు రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్లో నమోదు చేసుకొని ఉండాలి. అభ్యర్ధులు ఈ ఏడాది జూలై 1 నాటికి 46 ఏళ్లకు మించి ఉండకూడదు.
ముఖ్య తేదీలు :
ఆన్ లైన్ దరఖాస్తులు - 05 అక్టోబర్ , 2024.
దరఖాస్తులకు తుది గడువు - 21, అక్టోబర్ , 2024.
దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్ - అక్టోబర్ 23, 24
రాత పరీక్షలు - 11 నవంబర్ , 2024.
అధికారిక వెబ్ సైట్ - https://mhsrb.telangana.gov.in/