by Suryaa Desk | Mon, Sep 23, 2024, 03:42 PM
హైదరాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ గారితో మర్పల్లి మోమిన్ పేట్ మండలాల్లో పర్యటించిన "వడ్ల నందు, బిజెపి జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి, కేపీ రాజు శివరాజ్ భారత ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా, మోమిన్ పేట్ మండల పరిధిలోని మేకవనం పల్లి గ్రామంలో హైదరాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ గారితో, బిజెపి పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి గారితో కలిసి మా శారదా హాస్పిటల్ వారి "ఉచిత వైద్య శిబిరం" మరియు "సభ్యత్వ నమోదు" కార్యక్రమంలో పాల్గొన్న వికారాబాద్ నియోజకవర్గ బిజెపి పార్టీ కోఆర్డినేటర్ వడ్ల నందు.
అనంతరం మర్పల్లి మండలం సిరిపురం గ్రామంలో పార్టి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజ్, కేపీ రాజు, మా శారద హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ కొప్పుల రాజశేఖర్, మోమిన్ పేట్ మండల బిజెపి పార్టీ అధ్యక్షులు లక్ష్మారెడ్డి, మర్పల్లి మండల అధ్యక్షులు రమేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్ యాదవ రెడ్డి, బీజేవైఎం అధ్యక్షులు ఆశిరెడ్డి, లక్ష్మణ్ మల్లేష్ యాదవ్, యువ నాయకులు శ్రీనివాస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.