by Suryaa Desk | Wed, Sep 25, 2024, 04:02 PM
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో నోవోటెల్ సెప్టెంబర్ 22వ తేదీన జరగాల్సిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వాహకులు రద్దు చేశారు.ఒక్కసారిగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈవెంట్‌కు పోటెత్తడంతో వారిని కంట్రోల్ చేయలేక అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు అభిమానులపై పోలీసులు లాఠీ ఛార్జ్ కూడా చేశారు. చివరకు కార్యక్రమం రద్దు అయ్యే పరిస్థితి నెలకొంది. అయితే తాజాగా ఈ ఘటనపై స్పందించిన కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.దేవర ఈవెంట్ రద్దుకు కారణం ప్రభుత్వమే అన్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే.. ఈ కార్యక్రమం రద్దయిందన్నారు. ఓ సినిమా ఈవెంట్ నిర్వహించడం కూడా ఈ అసమర్థ ప్రభుత్వానకి రాలేదన్నారు.. మా ప్రభుత్వ హయాంలో ఇలా ఎప్పుడు జరగలేదన్నారు కేటీఆర్. ఏ చిన్న పండగ వచ్చిన మా నాయకులు.. దగ్గరుండి మరీ అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించేవారన్నారు. మొహర్రం, బోనాలు, గణేష్ ఊరేగింపు, నిమజ్జనాలు కూడా దగ్గరుండి అంతా చూసుకొనే వారు. కానీ ఈ ప్రభుత్వం కనీసం సినిమా ఈవెంట్ కూడా నిర్వహించలేకపోతుందని విమర్శించారు కేటీఆర్.
మరోవైపు ట్రాఫిక్ అనేది ఎలా ఉందో నా కంటే బాగా మీకే తెలుసన్నారు కేటీఆర్. హైదరాబాద్‌లో రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్య పై కూడా ఆయన మాట్లాడారు. గంటలు గంటలు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయే పరిస్థితి వచ్చిందన్నారు. గతంలో ట్రాఫిక్ ఎలా ఉండేది... ఇప్పుడు ఎలా ఉందనేది ప్రజలకు బాగా తెలుసన్నారు.