by Suryaa Desk | Thu, Sep 26, 2024, 03:45 PM
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం కేంద్రంలో తోటి మిత్రుడి( బొడ్డు సురేష్ బుగ్గారం నివాసి )కాలేయ సంబంధిత వ్యాధి అనారోగ్యంతో బాధపడుతున్న తోటి మిత్రులే కాకుండా పూర్వ విద్యార్థులు ఒకే పాఠశాలలో ZPHS బుగ్గారంలో చదువుకున్న ప్రేమానురాగాలు గుర్తుకొచ్చి ఈ సమయాన కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతుడని వారి మనసు తరంచలేక తోటి విద్యార్థి అయినా మిత్రుడుబొడ్డు సురేష్ కి 30 వేల ఐదు వందలు ఆర్థిక సాయం అందించారు.
ఇదే వీరి టీమే ఇంతకు పూర్వం కూడా గోపులాపూర్ వాస్తవ్యూరాలైన ఒక (వితంతువుకి )కూడా 20000/- ఇరవై వేల ఆర్థిక సహాయం చేసి ఆదర్శంగా నిలిచారు. ఎదుటివారిని హింసించి దోచుకు తినే ఈ జనరేషన్లో ఆర్థిక సహాయం చేసి ఆదర్శంగా నిలిచిన వాళ్ళని గొప్ప మనసు అని చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమంలో గడ్డం రమేష్, గైని శ్రీనివాస్, గాలి పెల్లి సతీష్, నక్కరాజు, తదితరులు పాల్గొన్నారు.