![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 20, 2025, 03:24 PM
ఎండిపోయిన పంటల వివరాలను అధికారులతో సర్వే చేయించి ప్రభుత్వం వారికి తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని, రైతు సంఘం రాష్ట్ర నాయకులు బొంతల చంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
చిట్యాల మండలం వెలిమినేడు లో గురువారం ఆయన ఎండిపోయిన వరి, మిరప పంటలను సీపీఎం, రైతు సంఘాల నాయకులతో పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట వివరాలను తెలుసుకున్నారు. అరూరి శ్రీను, లడే రాములు నెల్లికంటి నరసింహ ఇతర నేతలు, రైతులు ఆయనతో ఉన్నారు.