![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 25, 2025, 03:14 PM
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొమ్మిదోరోజు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తత చోటుచేసుకున్నది. అసెంబ్లీ ముట్టడికి బీజేపీ మహిళా మోర్చా నేతల యత్నించారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. మహిళా మోర్చా నేత శిల్పారెడ్డి సహా పలువురిని అరెస్ట్ చేశారు.