![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 10:25 AM
మేడ్చల్ జిల్లా శామీర్ పేట్‌లో విషాదం చోటుచేసుకుంది. జినోమ్ వ్యాలీ పీఎస్ పరిధిలో సిద్దిపేట జిల్లాకు చెందిన ప్రవీణ్ (23) అనే యువకుడు యాక్సిడెంట్‌లో మృతి చెందాడు. ప్రవీణ్ హైదరాబాద్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఇంటికి వెళ్తుండగా.. మార్గం మధ్యలో సెల్ ఫోన్ కింద పడింది. దీంతో బైక్ పక్కన ఆపి ఫోన్ తీసుకుంటుండగా.. కారు ఢీకొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందాడు.