![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 10:24 AM
తెలంగాణలో మార్చి 21న ప్రారంభమైన పదో తరగతి ప్రధాన పరీక్షలు బుధవారంతో ముగియనున్నాయి.టెన్త్ పరీక్షల కోసం 5,09,403 మంది రిజిస్టర్ చేసుకోగా.. మొత్తం 2,650 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. ఓరియంటల్ సైన్స్‌కు సంబంధించిన రెండు పరీక్షలు ఈ నెల 3, 4 తేదీల్లో జరుగుతాయి. వాటికి కొద్ది మంది మాత్రమే హాజరవుతారని అధికారులు తెలిపారు.