|
|
by Suryaa Desk | Thu, May 29, 2025, 12:24 PM
గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ మండలం ఉత్తనూర్ గ్రామంలో గురువారం జరిగిన మెగా రక్తదాన శిబిరం లో సంగాపురం రాముడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్ని దానాలకు మారుపేరు అయిన తిరుమల్ రెడ్డి 61వ జయంతిని పురస్కరించుకొని, అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు సంకాపురం రాముడు స్వయంగా రక్తదానం చేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని, రక్తదానం యొక్క ప్రాముఖ్యతను ప్రజల్లోకి చాటించారు. శిబిరానికి విశేష స్పందన లభించగా, తిరుమల్ రెడ్డి జయంతిని సేవా కార్యక్రమాల రూపంలో నిర్వహించడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. రక్తదాన శిబిరం విజయవంతం కావడంలో పాలుపంచుకున్న వారందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.