|
|
by Suryaa Desk | Thu, May 29, 2025, 12:30 PM
తెలంగాణ రాజకీయాలలో మరోసారి చర్చకు దారి తీసే వ్యాఖ్యలు చేశారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఓ చిట్‌చాట్ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయం లో చర్చనీయాంశమయ్యాయి. తన పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె తీవ్ర ఆరోపణ చేశారు.
"నన్ను జైల్లో ఉంచిన సమయంలోనే బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేయొద్దని స్పష్టంగా చెప్పాను. కానీ నా లేఖను ఎవరు బయటపెట్టారో ప్రశ్నిస్తే, నా మీద దాడులు జరుగుతున్నాయి. ఇది ఎంతో తీవ్రంగా ఉంది" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని, కానీ పార్టీ అధినేత కేసీఆర్ తాను రాజీనామా చేయవద్దని చెప్పారని వెల్లడించారు.
ఈ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ లోని అంతర్గత పరిస్థితులపై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. బీజేపీతో విలీనం అంశంపై ఇప్పటికే కొన్నాళ్లుగా వాదోపవాదాలు నడుస్తున్న నేపథ్యంలో, కవిత తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో కొత్త చర్చకు దారితీశాయి.