|
|
by Suryaa Desk | Thu, May 29, 2025, 07:02 PM
మహబూబ్‌నగర్‌లోని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో అధికారులు 10 గేట్లు ఎత్తి 66,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం దాదాపు 8 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ వరద నీటిని నియంత్రించి సాగు, తాగునీటి అవసరాల కోసం వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణా నదికి వరద ఉధృతి పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉప నదులకు వరద ఉధృతి పెరిగింది. ఫలితంగా వరద నీరంతా వచ్చి కృష్ణా నదిలో కలుస్తున్నది. ప్రస్తుతం 66వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. రేపటి వరకు వరద లక్ష క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ముందస్తుగా జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు.