|
|
by Suryaa Desk | Thu, May 29, 2025, 07:09 PM
పదేళ్ల కేసీఆర్ పాలనలో 6052 మంది విద్యార్థులు ప్రముఖ విద్యా సంస్థల్లో MBBS, IIT, IIMలలో ర్యాంకులు సాధించారని BRS నేత సబితా ఇంద్రారెడ్డి అన్నారు. 'సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల విద్యార్థులు MBBS, IIT, IIMలలో మంచి ర్యాంకులు సాధించారు. వారికి BRS తరపున అభినందనలు. KCR గురుకులాల ద్వారా విజయాలు సాధించిన విద్యార్థులే నిన్న రేవంత్ కార్యక్రమంలో ఉన్నారు. KCR ప్రభుత్వ ప్రయత్నాల వల్లే గురుకులాలు మంచి ఫలితాలు సాధించాయి' అని కొనియాడారు.యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రణాళిక ఏంటో ప్రభుత్వం స్పష్టం చేయాలని మాజీ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిలదీశారు. పాత సిలబసే ఉంటుందా, కొత్త సిలబస్ ఉంటుందాని ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలన్నారు. కేసీఆర్ పెట్టిన గురుకులాల్లో చదివిన విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరారు. వారిని అభినందించిన రేవంత్ రెడ్డికి ధన్యవాదాలన్నారు ఆమె. యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణాలకి రూ.85 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు అంచనా వ్యయం ఎందుకు మార్చారని అన్నారు.