ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Thu, May 29, 2025, 07:18 PM
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని గురువారం 42వేల 656మంది భక్తులు 5: 20నిమిషాల వరకు దర్శించుకున్నారని ఈవో వినోద్ తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ధర్మదర్శనంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు. అందరిని చల్లగా చూడు రాజన్న స్వామి అంటూ భక్తజనం వేడుకున్నారు.రాజన్నకు ఎంతో ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. అనుబంధ ఆలయాల్లో ప్రత్యేక పూజలో పాల్గొని తిరిగి ప్రయాణమయ్యారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఈవో వినోద్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏఈవోలు, సూపరింటెండెంట్‌లు, పీఆర్వో ఏర్పాట్లను పర్యవేక్షించారు.