ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Thu, Nov 20, 2025, 08:21 PM
నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని ఇతక్షిల పాఠశాలలో జిల్లా స్థాయి ఇన్ స్పైర్ అవార్డుల ప్రదర్శన 2024-25 గురువారం ముగిసింది. ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రత్యేక చొరవతో, జిల్లా విద్యాధికారుల సహకారంతో రెండు రోజుల పాటు జరిగిన ఈ సైన్స్ ఫెయిర్ లో, ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనలను వీక్షించారు. విద్యార్థులతో మాట్లాడుతూ, వారి ప్రదర్శనల ఉపయోగాలను అడిగి తెలుసుకున్నారు. ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులను అభినందించి, బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో MEOలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు.