|
|
by Suryaa Desk | Sat, Feb 21, 2026, 08:50 PM
ఖాజాగూడ చెరువు దిగువ ప్రాంతం, మణికొండ మరియు చిత్రపురి కాలనీ ప్రాంతాల నుండి ఉత్పత్తి అయ్యే మురుగును శుద్ధి చేయుటకు చిత్రపురి హిల్స్ సమీపంలో 30 ఎంఎల్డీ సామర్థ్యంతో నిర్మితం అవుతున్న చిత్రపురి మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని ఎండీ అశోక్ రెడ్డి సందర్శించారు.ఈ సందర్బంగా ఎండీ మాట్లాడుతూ.. శుద్ధి చేసిన నీటి పునర్వినియోగం కోసం వినియోగదారుల డిమాండ్ అంచనా వేయాలని సూచించారు. డిజైన్‌లో శుద్ధి చేసిన నీటి సరఫరాకు యూనిట్‌ను తప్పనిసరిగా చేర్చాలని, శుద్ధి చేసిన నీటి నిల్వ కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు, అనగా ట్రీటెడ్ వాటర్ సంప్ ఏర్పాటు చేయాలని చెప్పారు. చిత్రపురి కాలనీ మరియు పరిసర ప్రాంతాలలో గార్డెనింగ్, నిర్మాణ కార్యకలాపాలు, ఫ్లషింగ్, ల్యాండ్‌స్కేపింగ్ తదితర అవసరాల కోసం ట్యాంకర్ ద్వారా శుద్ధి చేసిన శుద్ధి జలాన్ని సరఫరా చేయడానికి ప్రత్యేక ట్యాంకర్ ఫిల్లింగ్ పాయింట్ ఏర్పాటు చేయాలని సూచించారు.