|
|
by Suryaa Desk | Tue, Feb 24, 2026, 12:43 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్ సర్కిల్, మల్లంపేట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన స్టార్క్ ఫిట్‌నెస్ జిమ్ స్టూడియోను ఈరోజు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, గౌరవ ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు గారు ముఖ్య అతిథిగా హాజరై దీపప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా జిమ్ నిర్వాహకులను శంభిపూర్ రాజు గారు అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్సీ గారిని సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లంపేట్ మరియు పరిసర ప్రాంత యువత ఆరోగ్యవంతంగా ఉండేందుకు ఈ జిమ్ ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని ఎమ్మెల్సీ గారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి గారు, భౌరంపేట్ మాజీ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, BRS పార్టీ నాయకులు పోలీస్ గోవింద్ రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, అర్వ సాయి కిరణ్ గారు, అభిషేక్ గారు, నందు గారు, విష్ణు గారు, అలాగే జిమ్ యాజమాన్యం శివకృష్ణ గారు, చంద్రశేఖర్ గారు, జయంత్ చౌదరి గారు, శరన్ సురేష్ గారు తదితరులు పాల్గొన్నారు.