|
|
by Suryaa Desk | Tue, Feb 24, 2026, 02:51 PM
బంగాళాఖాతంలో ద్రోణి, అల్పపీడం ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఫిబ్రవరి 24న దాదాపు 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరం భీమ్ అసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఈ హెచ్చరిక వర్తిస్తుంది. ఫిబ్రవరి 25న నల్గొండ, నాగర్ కర్నూల్, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఆ తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.