|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 03:27 PM
శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రూపొందిన 'సీతా పయనం' చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ చిత్రంతో అర్జున్ కుమార్తె ఐశ్వర్య కథానాయికగా పరిచయం అవుతున్నారు. నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ, అర్జున్, ధ్రువ సర్జా ముఖ్య పాత్రల్లో నటించారు. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో భారీగా విడుదల కానున్న ఈ సినిమా సెన్సార్‌ను పూర్తి చేసుకుంది. త్వరలో ట్రైలర్ విడుదల కానుంది.ప్రస్తుతం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీని బహుభాషల్లో భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సినిమాటోగ్రఫీని జి. బాలమురుగన్ అందించగా, డైలాగ్స్‌ను సాయి మాధవ్ బుర్రా రాశారు. యాక్షన్ సన్నివేశాలకు కిక్ యాస్ కాళీ కొరియోగ్రఫీ చేశారు.ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సోషల్ మీడియాలో మంచి స్పందనను అందుకోవడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని కుటుంబ సంబంధాల నేపథ్యంలో రూపొందింది. కాగా ఈ చిత్రం ‘సీతా పయనం’ ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుండగా త్వరలోనే ట్రైలర్ విడుదల చేయనున్నారు.
Latest News