|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 03:29 PM
ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. నటిగా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ స్టార్ హీరోయిన్ ట్యాగ్‌ను మాత్రం పొందలేకపోయింది. మీడియం రేంజ్ హీరోలతో తప్పించి పెద్ద హీరోల సరసన నటించే అవకాశం అనుపమకు దక్కలేదు. అయినప్పటికీ ఇంకా పట్టువదలకుండా ప్రయత్నిస్తూనే ఉంది. తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేసినా ఆశించిన క్రేజ్ రాలేదు. తెలుగులో 'పరదా', 'కిష్కిందపురి' వంటి సినిమాలు చేసినా పెద్దగా విజయం సాధించలేదు. గతేడాది తమిళంలో 'డ్రాగన్', 'బిసన్' సినిమాలతో హిట్ అందుకున్నా, ప్రస్తుతం చేతిలో సినిమాలు లేక ఖాళీగా ఉంది.
Latest News