|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 07:23 PM
ప్రముఖ నటుడి కుమారుడు ఓ సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో బూతు పాట పాడటంపై ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, 'షాక్ అయ్యాను.. ఈవెంట్ వదిలి వెళ్లిపోదామనుకున్నాను' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా ప్రచారం కోసం కొత్తదనం సృష్టించాలి, ప్రేక్షకుల వరకు చేరువ కావాలి. కానీ అందుకు అసభ్యతా మార్గాలు అనుసరించాల్సిన అవసరం లేదు. ప్రచారం కోసం ‘అర్ధనగ్నంగా ఉండటం, బూతు మాటలు మాట్లాడటం.. లాంటివి ఎందుకు?’ అంటూ ఆయన ప్రశ్నించారు. ఈవెంట్‌లో బూతు పాట పాడటం చూసి షాక్‌కు గురయ్యాను, ఇలాంటి ప్రమోషన్లతో సినిమాలు ఆడవు అంటూ చెప్పారు. మంచి ప్రమోషన్ ఎలా ఉండాలో ఉదాహరణలు కూడా ఇచ్చారు. బాలీవుడ్ చిత్రం ‘3 ఇడియట్స్’ ప్రమోషన్‌ను ప్రస్తావిస్తూ ఆ సినిమా ప్రచారంలో కొత్తదనం ఉంది. అమీర్ ఖాన్ లాంటి స్టార్‌లు ఇన్నోవేటివ్ స్టంట్లు చేసి మీడియా దృష్టిని ఆకర్షించారు. ఆ టైంలో అమీర్ చేసిన ఇన్నోవేటివ్ స్టంట్లలో పోలీసులు, మీడియా.. అంతా ఇన్వాల్వ్ అయ్యారు. కానీ అందులో ఎక్కడ అసభ్యత లేదు అని వివరించారు. ఆ రకమైన సృజనాత్మకతే సినిమా ఇండస్ట్రీకి అవసరమని ఆయన సూచించారు. ఇటీవల కాలంలో టాలీవుడ్ సినిమా ప్రమోషన్లలో అసభ్యతా ట్రెండ్ పెరిగిపోతోంది. కానీ జేడీ చక్రవర్తి లాంటి నటులు ఇలాంటి విషయాలపై గళం విప్పడం ఇండస్ట్రీకి మేలు చేస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘ప్రమోషన్ అంటే కేవలం సంచలనమే కాదు.. సభ్యతా, సృజనాత్మకతా ఉండాలి’ సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇండస్ట్రీలో ఇలాంటి ఘటనలు మరిన్ని జరగకుండా ఉండాలంటే, నిర్మాతలు, డైరెక్టర్లు జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.
Latest News