|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 03:05 PM
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతికి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయపు పన్ను ఎగవేత కేసులో విధించిన రూ.1.50 కోట్ల జరిమానాను రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో ‘పులి’ సినిమా ద్వారా వచ్చిన రూ.15 కోట్ల ఆదాయాన్ని ఐటీ రిటర్న్‌లో చూపలేదని శాఖ గుర్తించింది. 2015 సోదాల్లో లభించిన ఆధారాలతో 2022లో జరిమానా విధించారు. అయితే అప్పీలేట్ అథారిటీని ఆశ్రయించే హక్కు ఉందని కోర్టు స్పష్టం చేసింది.
Latest News