|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 02:18 PM
నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్రంలో రాకింగ్ స్టార్ యష్ రావణుడిగా నటిస్తుండగా, ఆయన తమ్ముడు విభీషణుడి పాత్రలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కనిపించనున్నారని సమాచారం. అధర్మం వైపు నడిచే అన్నకు, ధర్మం కోసం నిలబడే తమ్ముడికి మధ్య జరిగే పోరాటంలో ఈ ఇద్దరు నటుల నటన సినిమాకు హైలైట్‌గా నిలవనుంది. హాలీవుడ్ స్థాయి టెక్నాలజీతో రూపొందుతున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్, హాన్జ్ జిమ్మెర్ సంగీతం అందిస్తున్నారు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా మొదటి పార్ట్ 2026 దీపావళికి విడుదల కానుంది.అన్నదమ్ముల సమరం.. రామాయణ గాథలో విభీషణుడు అంటే కేవలం ఒక సహాయక పాత్ర కాదు. నీతికి, ధర్మానికి నిలువెత్తు రూపం. తన సోదరుడు రావణుడు చేస్తున్న అధర్మాన్ని సహించలేక, అతడిని ఎదిరించి రాముడికి అండగా నిలబడే గొప్ప వ్యక్తిత్వం అది. ఈ పాత్రలోని అంతర్మథనాన్ని పండించడానికి విజయ్ సేతుపతి వంటి గొప్ప నటుడు అవసరమని దర్శకుడు భావించారు. ఈ సినిమాలో రావణుడిగా ‘కేజీఎఫ్’ స్టార్ యష్ నటిస్తుండటంతో.. వెండితెరపై అన్నదమ్ములుగా యష్, విజయ్ సేతుపతి మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్ గా నిలవనున్నాయి. అహంకారంతో విర్రవీగే అన్నకు, ధర్మం కోసం నిలబడే తమ్ముడికి మధ్య జరిగే సంభాషణలు సినిమాకే ప్రధాన ఆకర్షణ కాబోతున్నాయి.భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, సుమారు రూ. 4000 కోట్లకు పైగా వ్యయంతో ఈ సినిమా రూపొందుతోంది. హాలీవుడ్ లెజెండ్ హాన్జ్ జిమ్మెర్, భారతీయ సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ కలిసి ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటం విశేషం. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తుండగా.. సన్నీ డియోల్ హనుమంతుడిగా మనల్ని అలరించబోతున్నారు. ఇంతమంది అగ్ర తారలు ఉన్నప్పటికీ, విభీషణుడిగా సేతుపతి చేసే నటనకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని చిత్రబృందం నమ్మకంగా ఉంది.
Latest News