|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 10:47 AM
ప్రముఖ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రవీనా రవి మూడేళ్లుగా ఆన్‌లైన్ వేధింపులకు గురవుతున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా తనను మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులను కూడా లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ విషయమై చట్టపరంగా ఫిర్యాదు చేసినా వేధింపులు ఆగలేదని వాపోయారు. సబరిష్ అనే వ్యక్తి అతడి సోదరుడితో కలిసి నకిలీ ఖాతాల ద్వారా అసభ్య సందేశాలు పంపుతున్నారని ఆరోపించారు. తనను రక్షించాలని కోరుతూ చేసిన ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. రవీనా ఫిర్యాదుపై పోలీసులు స్పందించినట్లు సమాచారం.అతను పలు నకిలీ ఖాతాల నుంచి నన్ను మాత్రమే కాకుండా.. ఇతర మహిళా నటీమణులను, ఆర్టిస్టులను కూడా వేధిస్తున్నాడని రవీనా రవి ఆరోపించింది. మేము ఇప్పటికే కలిశాం..మాకు పెళ్లి కుదిరింది అంటూ వంటి కల్పిత కథలను సృష్టిస్తున్నాడని తెలిపింది. ఈ నీచుల సోషల్ మీడియా ప్రొఫైల్స్ అందరూ కూడా బ్లాక్ చేయాలని సన్నిహితులకు విజ్ఞప్తి చేసింది. చెన్నై నగరం మహిళలకు అత్యంత సురక్షితమైందిగా భావిస్తారని.. ఇది నిరూపించాలంటే ఈ నీచులపై అధికారులు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. అంతేకాకుండా సీఎం స్టాలిన్‌తో పాటు చెన్నై పోలీసులకు ట్యాగ్ చేసింది. ఇది ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Latest News