|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 01:53 PM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ జపాన్‌లో అరుదైన ఘనత సాధించారు. ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్ “అనాన్” ఒంటరిగా బ్యాక్ కవర్‌పై కనిపించిన తొలి భారతీయ నటుడిగా ప్రభాస్ చరిత్ర సృష్టించారు. ఫిబ్రవరి 10న విడుదల కానున్న మ్యాగజైన్ ఇష్యూ నెంబర్ 2483 బ్యాక్ కవర్‌పై ఆయన ఫోటో ఉంటుంది. ఈ ఫీచర్‌ను మ్యాగజైన్ “Irresistible Feelings” థీమ్‌లో భాగంగా “Royal Audience Gravure”గా పేర్కొంది. బాహుబలి సినిమాతో జపాన్‌లో ప్రభాస్‌కు గుర్తింపు లభించింది.బాహుబలి’ సిరీస్‌తో జపాన్‌లో అపారమైన క్రేజ్ సంపాదించిన ప్రభాస్‌కు అక్కడి అభిమానులు ప్రత్యేకంగా అభిమానిస్తుంటారు. ఈ కారణంగానే ‘ANAN’ మ్యాగజైన్ ఎడిటోరియల్ టీమ్ ఆయనను ప్రత్యేకంగా ఎంపిక చేసినట్లు సమాచారం. భారతీయ సినీ నటుడికి ఈ స్థాయి అంతర్జాతీయ గుర్తింపు రావడం అరుదైన విషయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్ కలిగిన ప్రభాస్‌కు ఇప్పుడు ఈ మ్యాగజైన్ కవర్‌తో ఆయన గ్లోబల్ స్టార్డమ్ మరింత బలపడింది.
Latest News