|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 04:06 PM
చిరంజీవి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ. రామ్‌చరణ్‌కు కవలలు పుట్టిన నేపథ్యంలో, చిరంజీవి గతంలో చేసిన ‘వారసుడు’ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై మెగా కుటుంబ కోడలు లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు.‘మీ పోస్ట్ అభ్యంతరకరంగా, ఆనందకరమైన క్షణాలను తుడిచిపెట్టేలా ఉంది. కుటుంబంలోని మహిళలు, మనవరాళ్లతో చిరు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో మీకు తెలియదు. ఆయన చేసేదాంట్లో చాలామంది 1% కూడా చేయరు. తెలియని వ్యక్తుల గురించి మాట్లాడొద్దు’ అంటూ ఆమె స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు.చిరు తన కుటుంబానికి ఇచ్చే విలువ చాలా మందికి సాధ్యం కాదు. ఆయన చేసే పనుల్లో ఒక శాతం కూడా చేయలేని వాళ్లు ఆయన వ్యక్తిత్వంపై కామెంట్స్ చేయడం సరికాదు.' అంటూ రాసుకొచ్చారు.
Latest News