|
|
by Suryaa Desk | Thu, Feb 05, 2026, 10:52 AM
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మనశంకర వరప్రసాద్‌గారు’ సినిమా సంక్రాంతికి విడుదలై రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో సంక్రాంతికి విడుదలైన ‘పరాశక్తి’ సినిమా కూడా ఫిబ్రవరి 7 నుంచి జీ5లో ప్రసారం కానుంది.జనవరి 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో.. వెంకటేశ్ కీలకపాత్రలో మెప్పించారు.'మన శంకరవరప్రసాద్' విషయానికొస్తే.. నేషనల్ సెక్యూరిటీ అధికారి శంకరవరప్రసాద్ (చిరంజీవి).. కేంద్రమంత్రి శర్మ రక్షణ బాధ్యతల్ని నిర్వర్తిస్తుంటాడు. మంత్రి కూడా శంకర్‌ని కుటుంబ సభ్యుడిలా చూసుకుంటూ ఉంటాడు. శంకర్ గతంలో ప్రముఖ బిజినెస్‌మ్యాన్ జీవీఆర్ కుమార్తె శశిరేఖని పెళ్లి చేసుకుంటాడు. కానీ కొన్నాళ్లకు విడాకులు తీసుకుంటారు. దీంతో పిల్లల్ని చూసే ఛాన్స్ కూడా శంకర్‌కి ఉండదు. ఇది తెలుసుకున్న కేంద్రమంత్రి.. పిల్లలతో సమయం గడిపేలా వాళ్లు చదువుతున్న స్కూల్‌లో పీఈటీగా ఉద్యోగం ఇప్పిస్తాడు. కొన్నాళ్లకు శంకర్.. పిల్లలకు దగ్గరగానే ఉన్నాడని శశిరేఖకు తెలుస్తోంది. ఇదే టైంలో జీవీఆర్‌పై దాడి జరగుతుంది. దీంతో మాజీ భార్య ఇంటికే శంకర్.. సెక్యూరిటీ కోసం వస్తాడు. తర్వాత ఏమైంది? ఇంతకీ శంకర్-శశిరేఖ ఎందుకు విడిపోయారు? అనేదే మిగతా స్టోరీ.
Latest News