![]() |
![]() |
by Suryaa Desk | Wed, Feb 12, 2025, 03:39 PM
హిందీ చిత్రపరిశ్రమను ఉద్దేశించి రామ్‌గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు.'పుష్ప 2' వంటి చిత్రాలను బాలీవుడ్ వాళ్లు తెరకెక్కించలేకపోతున్నారని తెలిపారు. సామర్థ్యం ఉన్నప్పటికీ ఆ విధంగా ఏమాత్రం వారు ఆలోచించడం లేదని వ్యాఖ్యానించారు. బాలీవుడ్ నుంచే సౌత్ నటీనటులు గతంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నారని.. ఇక్కడి స్టార్ హీరోలు ఒకప్పుడు హిందీ చిత్రాలను రీమేక్ చేసేవారని అన్నారు. కానీ, ప్రస్తుతం ఉల్టా అయిందని అన్నారు.‘‘పుష్ప 2’ వంటి చిత్రాలను తెరకెక్కించడానికి బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్స్‌కు ఆ సామర్థ్యం లేక కాదు. కానీ, వారు ఆవిధంగా ఏమాత్రం ఆలోచించడం లేదు. దక్షిణాది, ఉత్తరాది.. ప్రేక్షకులు ఎక్కడైనా ఒక్కటే. సినిమాలే వారి మధ్య వ్యత్యాసం తీసుకువస్తాయి. అమితాబ్ బచ్చన్ హీరోగా రాణిస్తోన్న రోజుల్లో దక్షిణాది వారు హిందీ చిత్రాలను రీమేక్ చేసేవాళ్లు.
Latest News