![]() |
![]() |
by Suryaa Desk | Wed, Feb 12, 2025, 04:24 PM
సాయి కిషోర్ మచ్చా దర్శకత్వంలో తెలుగు నటుడు చేతన్ కృష్ణ నటించిన 'ధూమ్ ధామ్' ప్రేక్షకులని ఆకట్టుకోవటంలో విఫలమైంది. ఈ సినిమాలో నటుడి సరసన హెబ్బా పటేల్ నటిస్తోంది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం డిజిటల్ ప్లాట్ఫారంలో ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది. తాజగా ఇప్పుడు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇండియా వైడ్ గా ట్రేండింగ్ 3 పోసిషన్ లో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై MS రామ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Latest News