![]() |
![]() |
by Suryaa Desk | Wed, Feb 12, 2025, 04:29 PM
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సమర్పణలో వస్తున్న జాతా చిత్రం ‘శారీ’ నుంచి ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమాలో మలయాళీ భామ శ్రీలక్ష్మి సతీష్ (అలియాస్ ఆరాధ్య దేవి) లీడ్ రోల్ పోషిస్తోంది. ఒక వ్యక్తిపై ప్రేమ మరీ ఎక్కువైతే ఎలాంటి అనర్థాలు జరుగుతాయి అనే స్టోరీతో ఈ మూవీ తీశారు. ఫిబ్రవరి 28న తెలుగు, హిందీ, తమిళ, మళయాళ భాషల్లో ఈ మూవీ విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి గిరీశ్ కృష్ణ కమల్ దర్శకత్వం వహించారు.దర్శక, నిర్మాత రామ్ గోపాల్ వర్మ తన ఎమోషనల్ వాయిస్ తో.."సోషల్ మీడియాలో ఏవరెవరో ముక్కు మొహం తెలియని వాళ్ళతో పరిచయాలు పెంచుకుని, వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ గాని, ఫోర్ గ్రౌండ్ గాని, ఏమి తెలియకుండా నమ్మేయడంతో... ఎదురయ్యే ప్రమాదాలు, భయంకర సంఘటనలు, మనం చాలా చాలా విన్నాం! చూసాం!! అలాంటి నిజ జీవిత ఘటన ఆధారంగా తీసిన సినిమా ఈ 'శారీ'." అంటూ సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ వాయిస్ లో చెప్పారు.
Trailer of SAAREE film featuring https://t.co/iJw27XXfwV… as the GIRL in the SAAREE and https://t.co/rx30JroDCas the PSYCHO who is DANGEROUSLY OBSESSED with her . Film releasing in Hindi , Telugu ,Tamil and Malayalam on Feb 28 th https://t.co/E4711oA1cs
— Ram Gopal Varma (@RGVzoomin) February 12, 2025