by Suryaa Desk | Thu, Feb 13, 2025, 02:49 PM
నటుడు, నిర్మాత మోహన్‌బాబుకు సుప్రీం కోర్టు లో ఊరట లభించింది. జర్నలిస్టు పై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో ఫిటీషన్ వేశారు. దీనిపై గురువారం విచారణ జరిపిన న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసును జస్టిస్ సుదాంశ్ దులియా ధర్మాసనం విచారణ జరిపింది. గత విచారణ సందర్భంగా మోహన్‌బాబుపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు తెలంగాణ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా జర్నలిస్ట్‌పై జరిగిన దాడికి తాను బహిరంగంగా క్షమాపణ చెప్పానని.. నష్ట పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని మోహన్ బాబు ధర్మాసనానికి చెప్పారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మంచు మోహన్‌బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మోహన్‌బాబు ఆయన కుమారుడు మంచు మనోజ్ మధ్య ఘర్షణల నేపథ్యంలో జల్‌పల్లిలో ఉన్న మోహన్‌బాబు ఇంటికి న్యూస్ కవరేజీ కోసం వెళ్లిన తనపై మోహన్‌బాబు దాడి చేశారని పేర్కొంటూ జర్నలిస్టు రంజిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పహడీ షరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మోహన్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు కొట్టివేసింది.
Latest News