|
|
by Suryaa Desk | Wed, Dec 06, 2023, 01:46 PM
తెలంగాణలో రేపు కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. నూతన ప్రభుత్వ ఏర్పాటు నేపథ్యంలో ఐఏఎస్ అధికారుల పోస్టింగులపై విస్తృత చర్చ ప్రారంభమైంది. ఎవరు ఎక్కడ ఉంటారు? ఎవరికి ప్రాధాన్య పోస్టులు దక్కుతాయనే అంశంపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌తో పాటు శాఖాధిపతులను మారుస్తారా? లేక వీరినే కొనసాగిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు మధ్యాహ్నం 1:42 గంటలకు HYDలోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు, ఇతర రాష్ట్రాల నేతలకు ఆహ్వానం పంపారు. అలాగే మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు సహా తెలంగాణ ఉద్యమంలో అమరుల కుటుంబాలకు ఆహ్వానం పంపనున్నారు. కేసీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
తెలంగాణ ముఖ్యమంత్రిగా సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి రేపు ప్రమాణం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన దేనిపై తొలి సంతకం చేయనున్నారని ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలపై సంతకాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పథకాల అమలుకు దాదాపు రూ.88 వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా. సీఎం హోదాలో రేవంత్ ఏ వర్గానికి శుభవార్త చెప్పనున్నారో? రేపటి వరకు వేచి చూడాలి.