|
|
by Suryaa Desk | Wed, Dec 06, 2023, 01:46 PM
తెలంగాణ నూతన సీఎంగా రేవంత్‌రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు టీపీసీసీ ఆహ్వానాలు పంపింది.ఏపీ సీఎం జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్, టిడిపి అధినేత చంద్రబాబులను ఆహ్వానించారు. అలాగే మరికొందరు సీనియర్ నేతలకూ రేవంత్ సంతకంతో కూడిన ఆహ్వాన పత్రాలను పంపారు..