|
|
by Suryaa Desk | Sun, Dec 10, 2023, 11:01 AM
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు శనివారం భారీగా ఆదాయం వచ్చింది. శనివారం ఉదయం నుండి భక్తుల రద్దీ కొనసాగింది. అందులో భాగంగా ప్రధాన బుకింగ్, వీఐపీ మరియు బ్రేక్ దర్శనాలు, ప్రసాద విక్రయాలు, సువర్ణ పుష్పార్చన, కార్ పార్కింగ్, యాదరుషి నిలయం, కళ్యాణ కట్ట, వ్రతాలు, తదితర విభాగాల నుండి మొత్తం కలిపి రూ. 62, 31, 717 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో వైభవంగా కార్తీకమాస నిత్య సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తున్నారు. కొండ కింద శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో శనివారం 1744 మంది దంపతులు వ్రతాన్ని ఆచరించి, స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా తగిన ఏర్పాట్లు చేశారు. ఈ రోజు వ్రతాల ద్వారా రూ. 13, 95, 200 ఆదాయం వచ్చింది.