by Suryaa Desk | Sat, Jul 13, 2024, 11:06 AM
గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మోస్తరు వాన పడింది. మల్కాజిగిరి, కాప్రా ప్రాంతాల్లో గంటలో 2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో పలు రోడ్లపై వర్షపు నీరు నిలిచింది. అత్యధికంగా మల్కాజగిరిలో 2. 38, చర్లపల్లిలో 2. 33, ఏఎర్రావు నగర్ లో 1. 90 సెంటీమీటర్ల వాన పడింది. మిగిలినచోట్ల జల్లులు కురిశాయి. శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.