by Suryaa Desk | Mon, Aug 12, 2024, 10:21 AM
సీతారామ ఎత్తిపోతల పథకం లో భాగంగా ములకలపల్లి మండలం పూసుగూడెంలో నిర్మించిన రెండవ పంప్ హౌస్ ట్రయల్ రన్ కార్యక్రమాన్ని ఆదివారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ తో కలిసి నిర్వహించారు. మొదటగా మంత్రి బటన్ నొక్కి పంప్ హౌస్ ట్రయల్ రన్ నిర్వహించారు.