by Suryaa Desk | Mon, Aug 12, 2024, 03:01 PM
కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో 31 ఏండ్ల ట్రైనీ డాక్టర్‌పై దవాఖాన ప్రాంగణంలో హత్యాచారం జరిగినట్లు ఆరోపణలు రావడం దిగ్భ్రాంతిని కలిగించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బాధితురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు సానుభూతి తెలిపారు. ఇది భరించాల్సిన అంశం కాదని, మరీ ఇంత క్రూరత్వానికి ఒడిగట్టిన వారెవరినీ వదిలిపెట్టకూడదని ఎక్స్ వేదిగా డిమాండ్ చేశారు.