by Suryaa Desk | Mon, Aug 12, 2024, 10:05 AM
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి శ్రావణమాస సోమవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తజనం ముందుగా ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత కోడె మొక్కులతో పాటు తలనీలాలు సమర్పించుకొని సేవలో తరించారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో శీఘ్రంగా దర్శనమయ్యేందుకు ఆలయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.