by Suryaa Desk | Sun, Aug 11, 2024, 08:13 PM
నాగార్జున సాగర్‌తో పాటు మరికొన్ని విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్రం ఆలోచిస్తుందని కేంద్ర విమానాయానశాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. వీటితో పాటు శ్రీకాకుళం, దగదర్తిలో, కుప్పం వద్ద కూడా విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.ఆదివారం భోగాపురం విమానాశ్రయ పనులను మంత్రి పరిశీలించారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో విమానాశ్రయాల నిర్మాణానికి తాను కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. ఎన్టీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు నాలుగు శాతం పనులు పురోగతి సాధించాయని అన్నారు.అనంతపురం, ఒంగోలులో కూడా విమానాశ్రయం ఏర్పాటు చేయాలని కోరుతున్నారని తెలిపారు. రాష్ట్రం ఈస్ట్, కోస్ట్‌లో ఉందని, పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందే అవకాశమున్నందున భవిష్యత్ అవసరాలకు తగ్గట్లు విమానాశ్రయాల ఏర్పాటుకు ముందుస్తు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.