by Suryaa Desk | Sat, Jul 13, 2024, 12:32 PM
వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకంపై ఉమ్మడి పాలమూరు జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో మంత్రులు మొక్కలు నాటారు.