by Suryaa Desk | Sat, Aug 10, 2024, 03:34 PM
హైదరాబాద్ ఆగస్ట్10: రాజకీయ,ఆర్ధిక, సామాజిక అంశాల పై ప్రజలను చైతన్యవంతం చేస్తూ, శ్రామిక జన విముక్తి కై భావజాల వ్యాప్తి చేసే దిశ గా ప్రయాణం సాగిస్తున్న శ్రామిక మార్గం మాసపత్రిక వర్ధిల్లాలని సీపీఎం సీనియర్ నాయకులు జి. రాములు అన్నారు.సుకిటి పబ్లికేషన్స్ ద్వారా కవి రచయిత మోహన్ బైరాగి సంపాదకత్వం లో వెలువడుతున్న శ్రామిక మార్గం మాసపత్రిక ఆగస్ట్ సంచికను సుందరయ్య విజ్ఞాన కేంద్రం తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రంలో ఆవిష్కరించారు.ఈ ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్న విజ్ఞాన దర్శిని రమేష్ మాట్లాడుతూ... సమాజం లో శాస్త్రీయ ఆలోచనలు, అవగాహనను పెంపొందిస్తూ.ప్రజలలో ఉన్న మూఢ నమ్మకాలను తొలిగించే దిశగా శ్రామిక మార్గం పత్రిక పయనించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వర్కర్స్ పార్టి ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు రాయబండి పాండు రంగాచారి, రచయిత మధుసూదన్, కార్మిక నాయకుడు ప్రభాకర్, విద్యార్ధి నాయకుడు నాగరాజు పాల్గొన్నారు.