by Suryaa Desk | Thu, Sep 26, 2024, 04:24 PM
నేటి సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఆశ్లీల, విష సంస్కృతిపై ప్రతి ఒక్కరు పోరాడాలని యుపీఎన్ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కన్నం వెంకన్న అన్నారు. మియాపూర్ స్టాలిన్ నగర్ లో జరిగిన ఐక్య ప్రజానాట్యమండలి విస్తృత సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. సాంకేతిక అభివృద్ధి అవుతున్నదని సంబరపడుతున్న ప్రస్తుత సమయంలో యువత భవితను నిర్వీర్యపరిచే విధంగా సోషల్ మీడియా వేదికగా ముఖ్యంగా వివిధ వెబ్సైట్లలో ఆశ్లీల దృశ్యాలు,సినిమాలు పెరిగిపోతున్నాయన్నారు.
తద్వారా సమాజంలో మహిళలపైన, చిన్నారుల పైన అత్యాచారాలు,హింస పెరుగుతున్నాయన్నారు. సమాజాన్ని,ప్రజలను విష సంస్కృతి మరింత దిగజార్చే విధంగా ఉందని వీటికి వ్యతిరేకంగా కళా రంగాలు ప్రజలు పోరాడాలని అన్నారు. యు పి ఎన్ ఎం ఆధ్వర్యంలో ప్రజల్ని చైతన్యం చేసే కార్యక్రమాలను తీసుకొనేందుకు ఈ సమావేశం తగిన నిర్ణయం చేసిందని తెలిపారు. యు పి ఎన్ ఎం రాష్ట్ర అధ్యక్షులు మైదం శెట్టి రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వనం సుధాకర్, తుడుం అనిల్ కుమార్, వై రాంబాబు, ఎం రాజు,గూడ లావణ్య, ధారా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.