by Suryaa Desk | Wed, Oct 02, 2024, 03:01 PM
మంగళవారం తిప్పర్తి మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ నందు విద్యార్థులు పూలలు అలంకరించి బతుకమ్మలు తయారుచేసి ఆడి పాడారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ అపర్ణ మాట్లాడుతూ ప్రకృతి పూలను మనకిచ్చిన వరమని బుధవారం నుండి దసరా సెలవులు ఉన్న నేపథ్యంలో విద్యార్థులు పూలను పేర్చి బతుకమ్మలు
తయారుచేసి ఆడి పాడారు పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొన్నదని ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లలకు ప్రకృతి పైన ప్రేమ చెట్లను పెంపకం వాటి యొక్క ప్రాముఖ్యత తెలుస్తుందని బతుకమ్మ తెలంగాణలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.